PS Telugu News
Epaper

పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 77 కోట్ల రూపాయల నిధుల మంజూరు

📅 24 Feb 2026 ⏱️ 3:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పిప్రి కి సాగునీరు అందలేదు

జూన్ నుంచి ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పేరుకే పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నప్పటికీ పిప్రి గ్రామ రైతులకు సాగునీరు అందకుండా గత పాలకులు చేశారని, అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు నష్టపోయారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. పలుమార్లు ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో అప్పటి ప్రభుత్వం 58 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 77 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ లిఫ్టు ద్వారా పిప్రి,నగర్,రాయపూర్ కాండ్లి, తో పాటు పలు గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. పిప్రే నుండి సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి, విన్నవించడంతో 77 కోట్ల నిధులు ఇచ్చి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత పది సంవత్సరాలుగా ఇక్కడి పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే జూన్ కల్లా ఈ లిఫ్ట్ ద్వారా ఐదు వేల ఎకరాలకు సాగునీటినీ అందిస్తామన్నారు.

Scroll to Top