పుట్టినరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ.
పయనించే సూర్యుడు నవంబర్ 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీ లో ఉన్న అగాపే ఆశ్రమంలో ఉమ్మడి వెంకట్రామిరెడ్డి, భార్య ప్రకాశమ్మ వారి మనవరాలు ధన్వి 2వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ వారి కూతురు కందురి కిరణ్మయి,అల్లుడు కందూరి నిఖిలేశ్వర్ రెడ్డి వీరి కుటుంబము దుప్పట్లు పంపిణీ చేశారు. పుట్టినరోజుకు అందరూ కేక్ కట్ చేయడం, భోజనాల పెట్టడం ఇలా అందరూ చేస్తారు.అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి వృద్దులకు కప్పుకోవడానికి దుప్పట్లు చాలా అవసరమని భావించి కందురి ధన్వి పుట్టినరోజున అగాపే ఆశ్రమంలో ఉన్న వారందరికీ దుప్పట్లు ఇవ్వడం జరిగింది.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఎంతో సంతోషించి ధన్విని దీవించి వారికి అభినందనలు తెలిపారు.
