PS Telugu News
Epaper

పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం.

📅 10 Dec 2025 ⏱️ 2:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మానవ హక్కులను హరించడం ప్రమాదకరం.

రాజ్యాంగం హామీ పడ్డ మానవ హక్కులను ప్రజలకు అందించాలి.

పయనించే సూర్యుడు డిసెంబర్10

మక్తల్అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *”మానవ హక్కులు – మన భవిష్యత్తు”* అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు *వెంకటపతి రాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ* పుడమి ఫౌండేషన్ రాజ్యాంగపు హక్కులను ప్రచారం చేయడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ప్రజలు రాజ్యాంగ విలువల పట్ల కట్టుబడి ఉండాలని రాజ్యాంగ అమలు కోసం హక్కులను హరించి వేసినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తూ ముందుకు వచ్చినప్పుడే రాజ్యాంగపు హక్కులను కాపాడుకుంటామని అన్నారు. ప్రధాన వక్తవగా పాల్గొన్న మక్తల్ *డిప్యూటీ తహసిల్దార్ పుష్పాలత గారు మాట్లాడుతూ* మన రాజ్యాంగంలో అత్యున్నతమైన మానవ హక్కులను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. హక్కుల ఉల్లంఘన జరుగుతే తప్పనిసరిగా మాట్లాడాలని లేదా అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయించాలని పిలుపునిచ్చారు. *మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి మాట్లాడుతూ* భారత రాజ్యాంగం హామీ పడ్డ మానవ హక్కులలో ప్రధానమైనవి జీవించే హక్కు, విద్య హక్కు, ఆరోగ్యంగా ఉండే హక్కు, ఆత్మగౌరవంగా బతికే హక్కులు ప్రధానమైనవి అని అన్నారు. ప్రభుత్వాలు మానవ హక్కులను కాల రాయడంలో ముందుకెళ్తున్నాయని ప్రశ్నించేవారు లేకపోతే హక్కులను కాపాడుకోవడం కష్టమేనని అన్నారు. పేద అట్టడుగు వర్గాలకు విద్యాహక్కు చట్టాన్ని జీవించే హక్కును కాలరాస్తూ ప్రభుత్వాలు విద్యా,వైద్య రంగాలను మార్కెట్లో పెట్టి అమ్ముకోవడం ప్రారంభించాయని దీనిని రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా చూడాలని అన్నారు. మనిషి జీవించే హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వాలకు లేదని దొంగల పేరుతో ఇలా అనేక రకాల ముద్రలు వేసి మనుషులనే ప్రభుత్వాలు చంపివేయడం చట్ట వ్యతిరేకమైన చర్యని మనుషులు ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుందని అన్నారు. *ఆర్టిఐ సమాచార హక్కు చట్టం నారాయణ మాట్లాడుతూ* మానవ హక్కులను ప్రతి విద్యార్థి తెలుసుకొని ఆ హక్కుల సాధన కోసం కృషి చేయాలని అన్నారు. *అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ* దేశంలో ఇంకా బాల కార్మికుల వ్యవస్థ, బాల్య వివాహాలు, అంటరానితనం కొనసాగడం అంటే మానవ హక్కులను ప్రభుత్వాలు కుట్రపూరితంగా హరించి వేయటమేనని అన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు సాగాలని అన్నారు. *ఈ కార్యక్రమంలో* డిప్యూటీ తహసిల్దార్ పుష్పాలత గారు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, సమాచార హక్కు చట్టం నాయకులు నారాయణ, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, పుడమి ఫౌండేషన్ సభ్యులు శేఖర్, రవికుమార్, అంజి, అశోక్ మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Scroll to Top