పులిమామిడి గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 మక్తల్}
శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పులమామిడి గ్రామం ఊట్కూరు మండల పరిధిలోని పులిమామిడి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర సర్పంచ్ త్రివేణి చెన్నప్ప ఉప సర్పంచ్ మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ త్రివేణి చెన్నప్ప. మాట్లాడుతూ భారతదేశంలోనే చదువుల తల్లి పేరుగాంచిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటిగా మేము గ్రామ పంచాయతీలో ఎన్నిక కాబడిన తర్వాత నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ కొని ప్రతి ఒక మహిళా కూడా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు యువకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
