PS Telugu News
Epaper

పెళ్లి కార్యక్రమం ముగించుకుని వస్తుండగా ప్రమాదం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి అనంతపురం ప్రధాన రహదారిపై ములకలచెరువు మండలం, వేపూరి కోట సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానలు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం సత్యసాయి జిల్లా తనకల్లు మండలం, పాపిరెడ్డి వారి పల్లిలో జరిగిన బంధవుల వివాహానికి హాజరయ్యాయి. పెళ్లి జరిగిన మరుసటి రోజు( బుధవారం) తెల్లవారుజామున వారు కారులో తమ స్వగ్రమామైన మదనపల్లికి తిరిగి బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు మదనపల్లి –అనంతపురం ప్రధాన రహదారిలోని ములకలచెరువు మండలం, వేపూరి కోట వద్దకు రాగానే పొగమంచు కారణంగా అదుపుతప్పి అటుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశులు, ఎస్సై నరసింహుడు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

Scroll to Top