పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకం-గోళ్ళ రాజేష్.
పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే రుచికరము,శుచికరమైన ప్లేట్ చపాతీ,కర్రీ,పప్పు.రూపాయికే రుచికరమైన ప్లేట్ చపాతి,కర్రి,పప్పు తో మా కడుపు నింపుతున్న గోళ్ళ రాజేష్ సేవానిరతిని కొనియాడుతున్న పేద ప్రజలు. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే ప్లేట్ చపాతీ, కర్రీ ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా తెలిపారు.నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు చేసిన చపాతి కౌంటర్ ను కూరగాయల మార్కెట్ అధ్యక్షులు షేక్ అర్షద్, ఏపీయుడబ్లుజె జిల్లా కార్యదర్శి ఉస్మాన్ భాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ అధ్యక్షులు షేక్ అర్షద్ మాట్లాడుతూ గతంలో 20 సంవత్సరాల క్రితం నంద్యాలలో ఎస్పీవై రెడ్డి రొట్టెప్పప్పు ఏర్పాటు చేసి పేదల మనసు గెలుచుకున్నారన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు ప్రజలు అలాగే గోళ్ళ రాజేష్ కూడా పేదలకు తన వంతు సహాయం అందించేందుకు పేదల ఆకలి తీర్చేందుకు ఒక రూపాయికే రుచికరమైన, రుచికరమైన,నాణ్యతతో ప్లేట్ చపాతీ, కర్రీ,పప్పు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, పేద ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త, నంద్యాల వాసి గోళ్ళ రాజేష్ మదర్ థెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చారని, నంద్యాల వాసి అయినందుకు తన వంతు కృషి చేస్తున్నారని, గోళ్ళ రాజేష్ తల్లి విశాలాక్షి పేరిట ఈ పథకం ఈరోజు నంద్యాలలో ప్రారంభించడం జరిగిందని, ప్రతిరోజు ఈ పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఏపీయుడబ్లుజె జిల్లా కార్యదర్శి ఉస్మాన్ భాషా మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, ఇటీవల తుఫాన్ వల్ల పంట దెబ్బతిన్న కౌలు రైతులకు ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున దాదాపు 150 మందికి 4.50 లక్షల రూపాయలు పంచాడని, అలాగే దీర్ఘకాలిక రోగులకు మందులు కొనేందుకు తన వంతు సహాయంగా ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున దాదాపు 100 మందికి రెండు నుండి మూడు లక్షల రూపాయల వరకు 2 విడతలుగా సాయమందించాడని, అలాగే నిరుద్యోగ వికాస భృతి ద్వారా ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 2000 చొప్పున దాదాపు 100 మందికి రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ప్రస్తుతం విశాలాక్షి పేరిట పేదప్రజలకు చపాతీ, కర్రీ,పప్పును రూపాయికే అందించడం అభినందనీయమని ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్విని చేసుకోవాలని కోరారు.

