PS Telugu News
Epaper

పేదల పాలిట వరంగా మారిన సీఎం రిలీఫ్ పండు పథకం

📅 21 Mar 2026 ⏱️ 6:54 PM 📝 HOME
Listen to this article

ఎంత పెద్ద వ్యాధి అయిన పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

దేవుని బండ తాండవాసులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)కాయ కష్టం చేస్తూ పూటగడిపే పేదవాళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా నిలబడుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంత పెద్ద రోగమైన పేదలు ధైర్యంగా చికిత్స చేయించుకుంటున్నారూ ఒకరోజు పని చేస్తేనే పూట గడిచే పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు ఫరూక్ నగర్ మండలం దేవుని బండ తండ గ్రామపంచాయతీ తాండ వాసులు మూడవత్ చందులాల్ కేతావత్ శ్రీను ఇద్దరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బలరాజ్ గారు గ్రామ ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుమన్ నాయక్ సీపీఐ పార్టీ నాయకుడు ఎం పవన్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top