PS Telugu News
Epaper

పేదింటి పెళ్లి వేదికకు కాంగ్రెస్ కానుక..

📅 31 Dec 2025 ⏱️ 6:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కొందుర్గు, కేశంపేట మండలాలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి..

చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

రెండు మండలాలకు కలిపి రూ.86 లక్షల 9వేల 986 చెక్కుల పంపిణీ

( పయనించే సూర్యుడు డిసెంబర్ 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

పేదింటిలో జరిగే వివాహ శుభకార్యాలకు కాంగ్రెస్ అందించిన కానుక పేరే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు, కేశంపేట మండలాల లబ్ధిదారులకు బుధవారం క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. పేదింటి పిల్లల వివాహాల కోసం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఈ చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదింటి ఆడపడుచులకు ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. మొత్తం రెండు మండలాలలో కలిపి కొందరుకు మండలంలో 28, కేశంపేట మండలంలో 55 మంది లబ్ధిదారులకు రూ.86,09,986 లక్షల విలువైన చెక్కులను అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం నిరుపేదల సంక్షేమం గురించే ఆలోచిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, శ్రీధర్ రెడ్డి, వీరేశం, కృష్ణారెడ్డి, ఇబ్రహీం, అగునూరు బస్వం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top