పేద విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
పయనించే సూర్యుడు జనవరి 09,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగుల పంపిణీ :-ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల పట్టణంలోని ఎస్.ఆర్.బి.సి కాలనీలో ఉన్న ‘పరివర్తన హెల్ప్ సెంటర్’ విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అండగా నిలిచారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు మరియు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు తెలిపారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా విద్యార్థులకు అండగా నిలుస్తున్న పరివర్తన హెల్ప్ సెంటర్ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరివర్తన హెల్ప్ సెంటర్ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, ఎం కృష్ణాపురం శేఖర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
