పొలంలో హార్టికల్చర్ పంటల పై రైతులకు అవగాహన
పయనించే సూర్యుడు డిసెంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు సంబంధించిన గ్రామ ఛాంపియన్ రైతులకు క్షేత్ర సందర్శన కొరకు బోడిపాడు గ్రామంలో గడ్డం.మస్తాన్ రెడ్డి పొలంలో హార్టికల్చర్ పంటలైన మామిడి,సపోటా మొదలైన పంటల మధ్యలో వినూత్నంగా అంతర పంటలుగా మినుము, పెసర, అలసంద పంటలు వేసి వాటి ద్వారా అధిక ఆదాయం పొందే ఆ రైతు అనుభవాలను మండల ఛాంపియన్ రైతులకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మండలంలోనీ ప్రతీ రైతు మెట్ట పంటలు పండించడం ద్వారా తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం పొందాలని మండల వ్యవసాయ అధికారి హిమబిందు రైతులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో చాంపియన్ రైతులు ఎన్.వి కండ్రిక జి .రామ్ ప్రసాద్ రెడ్డి చేజర్ల. పంగ. పుల్లరెడ్డి, కాకివాయి వి. వెంకటేశ్వర్లు పెరుమాళ్ళపాడు కె.కామేశ్వర బాబు . మండల వ్యవసాయ అధికారి హిమబిందు , గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొనారు.