పొలాల అమావాస్య వేళ పోలేరమ్మ అవతారంలో దర్శనమిచ్చిన కాట్రేనికోన గ్రామదేవత మావుళ్ళమ్మ – పోటెత్తిన భక్తజనం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 11 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ ) శ్రావణ మాసం, పొలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని కాట్రేనికోన గ్రామ దేవత, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు పోలేరమ్మ తల్లి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, సహస్రనామార్చనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కుంకుమ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ దేవస్థానం తరపున పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తులందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.