పోలీసు అమర వీరుల త్యాగఫలం వెలకట్టలేనిది
పయనించే సూర్యుడు అక్టోబర్ 28 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి, పోలీసు అమరవీరుల త్యాగఫలం వెలకట్టలేనిదని హెడ్ కానిస్టేబుల్ శివ గౌడ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం యాడికి లోని స్టార్ పారడైజ్ హైస్కూల్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. విధులలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను సంస్మరించు కోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు.పోలీసుల విధులు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పవన్ కుమార్ రెడ్డి, మహేష్, సూర్యుడు, స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ మేనేజ్ మెంట్ నాగేంద్ర, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
