PS Telugu News
Epaper

పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు”జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపిఎస్

📅 10 Apr 2026 ⏱️ 1:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

సూర్యాపేట జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలియజేయునది ఏమనగా, బాధితులకు సౌలభ్యం కల్పించే విధంగా తెలంగాణ పోలీస్ “ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు” విధానాన్ని అమలు చేస్తున్నది.ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు మరియు బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి ఆస్తి సంబంధిత, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాల వంటి సంభందహిత నేరాల్లో బాదితులు పోలీసు స్టేషన్ కు రాలేని పరిస్థితులలో ఫోన్ ద్వారా సమాచారం అంధించిన యెడల వెంటనే, పోలీసు వారు వారి నివాసం లేదా తమకు అనుకూలమైన ప్రదేశమునకు వెళ్ళి ఫిర్యాదు స్వీకరిస్తారు, ఫిర్యాదుదారు ఫిర్యాదు రాయలేని పరిస్థితులలో పోలీసు వారే బాధితుని వాంగ్మూలం వారి భాషలోనే నమోదు చేసి చదివి వినిపించి వారి సంతకం తీసుకొని అక్కడినుండే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అక్కడే ఫిర్యాదుదారునికి ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేయబడుతుంది.ప్రత్యేకంగా మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగ వెళతారు. అవసరమైతే ఇంటర్‌ప్రెటర్ లేదా ప్రత్యేక ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం తీసుకుంటారు. పోలీసులు సంఘటన స్థలాన్ని రక్షించి, సాక్ష్యాలను సేకరించే చర్యలు వెంటనే చేపడతారు. ఈ విధానం వల్ల ఫిర్యాదు నమోదు ఆలస్యం తగ్గుతుంది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే భారం తగ్గుతుంది.ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నేరాలను నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరడమైనది. సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్నది.

Scroll to Top