PS Telugu News
Epaper

పోస్టల్ జీవిత భీమా భావితరానికి మన కుటుంబానికి అవసరం

📅 16 Feb 2026 ⏱️ 9:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఐటి డి ఏ సహాయ అధికారి డేవిడ్ రాజ్

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 16పొనకంటి ఉపేందరరావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :డబ్బుని ఆధా చేసుకోవాలంటే అవసరానికి ఉపయోగపడే పోస్టల్ భీమాలో తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి పాలసీ తీసుకొని తమ కుటుంబాలకు ఆర్థికచేకూర్పు అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత పోస్ట్ డిపార్ట్మెంట్ జీవిత బీమా పాలసీ చేయించడం వలన ఉద్యోగులకు భవిష్యత్తులో కలిగే లాభాల గురించి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి అనవసరమైన ఖర్చులు చేయకుండా కుటుంబ భవిష్యత్తు కోసం మరియు ఆడపిల్లల పెళ్లిళ్లు, చదువుల కొరకు ఇప్పటినుండే తన తాహత్తును బట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో బీమా పాలసీ తీసుకుంటే వారు యుక్త వయసుకు వచ్చేసరికి అన్ని విధాల ఆ డబ్బు అవసరానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ శాఖ పర్యవేక్షకుడు వీరభద్ర స్వామి మాట్లాడుతూ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ భారత పోస్ట్ డిపార్ట్మెంట్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక సేవ అని, ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా దారులకోసంరూపొందించబడిందని, ఈ ఇన్సూరెన్స్ మార్కెట్లో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ రేటును అందించడం వల్ల పాలసీదారులకు అత్యంత ప్రయోజనకరంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ భారత ప్రభుత్వ సేవ కావడం వలన అత్యంత సురక్షితమైనది,విశ్వాసనీయమైనదని, 1884 నుంచి సేవలందిస్తూ వస్తుందని అన్నారు. అందుకు ప్రతి ఉద్యోగి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందవచ్చని, 100 రూపాయల నుంచి మొదలుకొని ఎన్ని వేలైనా ఈ పాలసీలో సభ్యులుగా చేరవచ్చని, ఐదు సంవత్సరాలు తర్వాత ప్రీమియంతో పాటు అత్యధిక బోనస్ రూపంలో పాలసీ డబ్బులు తీసుకోవచ్చని, పాలసీ పొందిన వ్యక్తి ప్రమాదానికి గురి అయితే దానికి సంబంధించిన ప్రమాద బీమా పథకం ద్వారా నగదు పొందవచ్చని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని సెంట్రల్ మరియు స్టేట్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ శాఖలలో పనిచేయుచున్న ఉద్యోగులు, కార్పొరేషన్లు, ప్రసిద్ధ సంస్థలలో పనిచేయుచున్న అధికారులు ఉద్యోగులు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకొని పోస్టల్ శాఖకు సహకారం అందించాలని ఆయన అన్నారు. అనంతరం పోస్టల్ శాఖ ద్వారా అమలవుతున్న 28 రకాల పాలసీల గురించి సంబంధిత పోస్టల్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి రాంబాబు, పోస్టల్ శాఖ సహాయ పర్యవేక్షకుడు సూర్య ప్రకాష్ రావు, పోస్ట్మాస్టర్ రామ్మోహన్, శరత్ చంద్ర, పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ ప్రసాద్, సుధీర్, పోస్ట్ మేన్ లు సత్యనారాయణ, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, డి టి ఆర్ వై ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, శ్రీమతి సంధ్య మరియు ఇతర విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top