ప్రచారం లో దూసుకుపోతున్న సదర్ లాల్…
ఉదయాన్నే మార్నింగ్ వాక్ ప్రచారం..
75 ఏళ్ళ వయసులో కూడా కుర్రోళ్ల కి మించి తనదైన స్టైల్లో ప్రచారం….
పయనించే సూర్యుడు, అశ్వాపురం,డిసెంబర్ 6
మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ధి బానోతు సదర్ లాల్ ప్రచారం లో తన దైన స్టయిల్లో దూసుకుపోతున్నారు, పొద్దు పొద్దున్నే పంచాయతీలో గల ప్రతీ వీధికి తిరిగి ఓటర్లను కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని మీ సమస్యలకు పరిష్కారం నా గెలుపు అని అభ్యర్ధిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. గతం లో తన శ్రీమతి శారద చేసిన అభివృద్ధి ని కొనసాగిస్తా అని పంచాయతీ లో మిగిలిన కొద్దిపాటి రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీలు మరియు పంచాయతీ కి నూతన భవనం ప్రధాన అజెండా గా ప్రచారం చేస్తున్నారు.అశ్వాపురం గ్రామంలో ప్రతి ఇంటికి తెలిసిన నాయకుడు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న వ్యక్తి,చిన్న ,పెద్ద అని తేడా లేకుండా అందరిని తల్లి, చెల్లీ, అన్న , బాబాయ్ అని అందరికీ అందుబాటులో ఉండే మనిషి. పేదల కోసం, వృద్ధుల కోసం, యువత కోసం నిజంగా పని చేసిన సేవా తత్పరత గ్రామానికి కావలసిన నిధులు పథకాలు తెచ్చే సామర్థ్యం ఉన్న అనుభవజ్ఞుడు అని అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ని, ఈ నెల పదకొండో తేదీన జరుగుతున్న ఎన్నికల్లో ఫుట్ బాల్ గుర్తు కి ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరుతున్నారు.తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారి ఆదేశాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.ప్రలోభాలకు లొంగొద్దని పనిచేసే నాయకుడిని స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత,వార్డు అభ్యర్థులు వేములపల్లి అశ్రిత,కొమరం కౌసల్య,గుర్రం త్రివేణి, చిట్టూరి భాస్కర్, నూకల లింగయ్య,సవలం అనిల్,నూకల కనతాల ధనలక్ష్మి నాయకులు, వేములపల్లి రమేష్, షేక్ ఖధీర్,బూతం వెంకటేశ్వర్లు,తాడబోయిన వెంకటేశ్వర్లు,వలబోజు మురళీకృష్ణ, టీ డీ పి వాసు,ఇలాసాగరపు వరప్రసాద్, హరీష్, చుంచు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
