పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం ర్యాలీని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.పట్టణంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటికరణకు నిరసనగా ఈ నెల 28న నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మాట్లాడారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలోనే అనేక ప్రభుత్వాల హయాంలో 11 మెడికల్ కళాశాలలు వస్తే ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే 17 మెడికల్ కళాశాలలు వచ్చాయని అన్నారు. వీటిలో ఐదు మెడికల్ కళాశాలలు పూర్తయి సీట్ల కేటాయింపులు కూడా జరుగుతున్నాయని అన్నారు.
పులివెందుల కళాశాల పూర్తయిన చంద్రబాబు అడ్డుకున్నారని, పాడేరు కళాశాలకు 50 సీట్లు చాలంటూ మిగతావి రాకుండాఅడ్డుకున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వం పూర్తి చేయలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఏడాదికి రెండు చొప్పున పూర్తి చేసినా నాలుగైదేళ్లలో అన్ని కళాశాలలుఅందుబాటులోకి వస్తాయన్నారు.మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ దుర్మార్గ చర్య అని, దీనిపై ప్రజల్లో సైతం వ్యతిరేకత పెరిగిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని, అందులో భాగంగా ఈ నెల 28న ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.కోటి సంతకాల సేకరణ ప్రారంభం మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు, నాయకులుప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు బిజివేముల పిచ్చిరెడ్డి, చెన్ను వెంకటేశ్వరరెడ్డి, పులగం శంకర్ రెడ్డి, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరి పులిమి రమేష్ రెడ్డి, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు చెరుకూరు కామాక్షయ్యనాయుడు, బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, నందవరం ప్రసాద్. నోటి వినయ్ కుమార్ రెడ్డి. ఆండ్రా సుబ్బారెడ్డి. వాశిపల్లి లక్ష్మిరెడ్డి. వినోద్, సర్పంచ్ బొలిగర్ల వెంకటేశ్వర్లు, జమ్రు, సుబ్బారెడ్డి, జనార్థన్ రెడ్డి. జయపాల్ రెడ్డి, తోడేటి సుబ్రహ్మణ్యం, కొండా చిన వెంకటేశ్వర్లు. సుబ్రహ్మణ్యంరెడ్డి, అశోక్. కొప్పోలు వెంకటేశ్వర్లు. చిల్లూరు వెంకటేశ్వర్లు. కలాం, మస్తాన్ వళీ. కొండయ్య, యానాదిరెడ్డి,బాలచెన్నయ్య, గోవర్థన్. షారూక్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


