ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్
పయనించే సూర్యుడు,మార్చి6, అశ్వాపురం:
ఈ రోజు అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల) కార్యక్రమంలో భాగంగా 10 ప్రధాన అంశములతో కార్యాచరణ ప్రణాళిక అంశాలు పై పాలక వర్గ, వివిధ శాఖల సమన్వయ సన్నాహక సమావేశం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తో మొదలు పెట్టారు. మొదటి రోజు కార్యాచరణ లో భాగంగా గ్రామ పంచాయతీ పరిసరాలను పంచాయతీ కార్యదర్శి,వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు స్వచ్ఛందంగా పరిశుభ్ర పరచడంలో భాగస్వామ్యులవడం జరిగింది ఇట్టి కార్యక్రమం నందు ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు ,వార్డు సభ్యులు వేములపల్లి అశ్విత, గుర్రం త్రివేణి, నూకల లింగయ్య, మురివినేని చంద్ర కళ, కణతాల ధనలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది.
