PS Telugu News
Epaper

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ను విజయవంతం చేయాలి : మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు.

📅 06 Mar 2026 ⏱️ 4:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 06.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 Days Action Plan) కార్యక్రమము ఈ రోజు తేది: 06.03.2026 న ఉదయం: 9.00 గంటలకు మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఉన్న గెస్ట్ హౌస్ నందు ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలచే కార్యక్రమము ప్రారంభించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమములో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తేది: 06.03.2026 నుండి 15.03.2026 వరకు మున్సిపాలిటీ ప్రతి వార్డులో నిర్వహించే స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ మరియు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ మరియు రోజు వారిగా చేసే కార్యకలాపాలను మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం గారు వివరించడం జరిగింది.
గౌరవ చైర్‌పర్సన్ “కోడి శ్రీనివాసులు” గారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అన్ని వార్డులలో దోమల నివారణకు ఫగ్గింగ్ చేయించమని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ లో భాగంగా అన్ని వార్డులలో బ్లీచింగ్ చేయిస్తామని చెప్పడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో గౌరవ చైర్ పర్సన్ “కోడి శ్రీనివాసులు” గారు, గౌరవ వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ గారు, మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి తెలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాతయాదవ్ రెడ్డి, జెల్ల ధనమ్మశీను, కోన్రెడ్డి మధు, కోడి సుష్మవెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్ , కటకం రమేష్ గార్లు, కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఐతరాజు మల్లేష్, జున్ను, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు మరియు పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Scroll to Top