ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సన్నాహక సమావేశం: 99 రోజుల లక్ష్యంతో ముందడుగు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమం ఒక యజ్ఞంలా ప్రారంభమైంది.నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన – 99 రోజులే లక్ష్యం అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు రాబోయే 99 రోజులు అత్యంత కీలకమని, ప్రతి అధికారి ప్రజలకు అం దుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. ఏసీ గదులకే పరిమితం కాకుండా, అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ఈ ‘ప్రగతి ప్రణాళిక’ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నిజామాబాద్‌ను అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ “అభివృద్ధిలో రాజీ పడొద్దు”ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు నీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు మరియు మౌలిక సదుపాయాల పనులను ఈ 99 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు.వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం ఉద్దేశించిన పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.జిల్లాలో ఉన్న వనరులను ఉపయోగించుకుని కొత్త పరిశ్రమల స్థాపనకు, తద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.గత పాలనలో పేరుకుపోయిన సమస్యలను ప్రక్షాళన చేస్తూ, ప్రజలకు ప్రభుత్వ రాని వెసులుబాటు లేకుండా సేవలు అందించడమే ఈ యజ్ఞం యొక్క అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో అమలు చేయబోయే కార్యాచరణ నివేదికలను అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
