PS Telugu News
Epaper

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భీంగల్ లో 99 రోజుల కార్యచరణ ప్రణాళిక

📅 06 Mar 2026 ⏱️ 7:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సంచాలకులు పురపాలక పరిపాలనశాఖ ఆదేశాల మేరకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు శుక్రవారం రోజున పట్టణంలోని ఆరో వార్డులో చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల ఆరో తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 99 రోజుల్లో కార్యక్రమాల్లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ పరిష్కరణ మరియు ఆరోగ్యం మరియు సంక్షేమం మరియు పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్ నివారణ కార్యక్రమం మరియు రైతులు వ్యవసాయంపై అవగాహన మరియు సమస్యలపై పరిష్కారం మరియు విద్య యువతకు క్రీడలు. మహిళా సంఘాల ప్రోత్సాహం మరియు మహిళల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం. పర్యావరణ రక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చైర్ పర్సన్ తెలిపారు. అలాగే పట్టణంలో వివిధ వార్డులో ఈరోజు నుండి ప్రత్యేక పారిశుధ్య భాగంగా మురికి కాలువల శుభ్రం చేయడం జరిగింది మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఆయిల్ బాల్స్ వేయడం ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటిలత నర్సయ్య. కమిషనర్ గోపు గంగాధర్. కౌన్సిలర్లు పర్స కుశలత అనంతరావు.ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు. సందీప్. నీలం రవి.సంగ్యా నాయక్. బోదిరే లావణ్య నర్యయ్య. మల్లెల అనుపమ ప్రసాద్. గున్నాల బాలలక్ష్మీ భగత్. మున్సిపల్ మేనేజర్ నరేందర్ మున్సిపల్ సిబ్బంది ఎలక్ట్రిసిటీ ఏఈ. ఏఈ ప్రజాప్రతినిధులు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top