PS Telugu News
Epaper

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో విద్యాలయాల పరిసరాలను శుభ్రం చేసిన అశ్వాపురం ప్రజలు

📅 07 Mar 2026 ⏱️ 4:34 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సదర్ ఆధ్వర్యంలో కార్యక్రమం

పయనించే సూర్యుడు, మార్చి07,అశ్వాపురం: శనివారం రోజు “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” (99 రోజుల) కార్యాచరణ లో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని విద్యాలయాల్లో మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. అదేవిధంగా చవిటి గూడెం అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయినిలు సుశీల, విజయ,వార్డు సభ్యులు గుర్రం త్రివేణి, కౌసల్య, ముత్తబోయిన వెంకటేశ్వర్లు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top