PS Telugu News
Epaper

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టబడి ఉంది- రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

📅 02 Apr 2026 ⏱️ 6:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో

కమ్మర్ పల్లి మండలం హాస కొత్తూరు చౌట్ పల్లి గ్రామాల గ్రామ సభలలో పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఆ తర్వాత ఈ ప్రభుత్వం (కాంగ్రెస్ ) ఏర్పడ్డ వరకు రేషన్ కార్డు ఇవ్వలేదు పిల్లలకి పిల్లలు పుట్టినా కూడా గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు.ఈ ప్రభుత్వం అడిగిన అందరికీ రేషన్ కార్డు ఇచ్చింది ఇంకా రానివారికి అప్లై చేస్తే అందరికీ రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. మరియు జీరో కరెంట్ బిల్ ప్రతి గ్రామంలో అమల్లో ఉంది చాలామంది నిరుపేదలకు ఊరటను ఇచ్చింది. ఉచిత బస్సు ఆడవారికి ఎక్కడికి వెళ్లాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు బస్సులు తక్కువ ఉన్నాయని ఆర్మూర్ బస్ డిపో కి 36 బస్సులు నూతన బస్సులు వచ్చాయి. అత్తకు 4000 కోడలికి 2000 పెన్షన్ రేషన్ కార్డు ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు కంప్లీట్ అయింది కాబట్టి 200000 కొత్త పెన్షన్లకి ప్రభుత్వం క్లీనర్స్ కూడా ఇచ్చింది అర్హత ఉన్న అందరికీ పెన్షన్లు కచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు చౌట్ పల్లి గ్రామంలో 39 ఇంద్రరమ్మా ఇండ్లు ఇవ్వడం జరిగింది.ఎలక్షన్ల వరకు మాత్రమే పార్టీలు ఎలక్షన్స్ తర్వాత అందరూ ఒకటిగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమం కమ్మర్ పల్లి మండల స్థాయి అధికారులు కమ్మర్ పల్లి మండల ప్రజాప్రతినిధులు వివిధ గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామం రాజేశ్వర్ కోన సముందర్ సొసైటీ సి ఈ ఓ పనిచేసినాడు అతను మొన్న మరణించగా వారి కుటుంబాన్ని మన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని గురువారం రోజున పరామర్శించడం జరిగింది మరియు రాజేశ్వర్ కుమారుడుకు అధైర్య పడవద్దని ధైర్యంగా చెప్పడం జరిగింది

Scroll to Top