
పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండలంలోని విభిన్న ప్రతిభవంతులైన విద్యార్థులకు ఉచిత ఉపకారణాల పంపిణీ నిమిత్తం సమగ్ర శిక్ష నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించబడుతుంది అని మండల విద్యాశాఖ అధికారి డిసి. మస్తానయ్య గురువారం తెలిపారు ఈ క్యాంపుకు 6 నుంచి 18 సంవత్సరాలు లోపు దివ్యంగా విద్యార్థులు అర్హులని వీరికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఉపకరణాల సిఫారసు చేస్తారని పేర్కొన్నారు దివ్యాంగ విద్యార్థులు 3 పాస్పోర్ట్ సేస్ ఫోటోలు ,సదరం సర్టిఫికేట్, రేషన్ కార్డు యు డి ఐ డి కార్డు ,ఆధార్ కార్డు గుర్తింపు కార్డులు జిరాక్స్లు రెండు సెట్లు తీసుకుని మెడికల్ క్యాంపుకు హాజరు అవ్వాలని కోరారు ఈ శిబిరంలో గుర్తించిన విద్యార్థులకు అలిమ్ కో సంస్థ ద్వారా వినికిడి యంత్రం ,వీల్ చైర్, సిపి చైర్స్ ఎమ్మార్ కిడ్స్ బ్రైలీకేట్ మొదలైనవి ఉపకరణాలు త్వరలోనే అందజేయబడతాయని షేక్. మస్తాన్ వలి ఈ నెంబర్ కు సంప్రదించాలని 9441554560 తెలియపరిచారు ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు