ప్రతి ఒక్కలో పోటీతత్వం రావాలి
మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వర రావు కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన మరియు చెయ్యేరు పాఠశాలలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తగు సూచనలు సలహాలను అందించారు, ఈ సందర్భంగా విద్యార్ధిని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులలో దాగిఉన్న
పోటీతత్వం ఉంటే మంచి భవిష్యత్తు ఉందన్నారు, విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టులలో వెనకబడి ఉన్నారు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఎమ్ వెంకటరమణ, ఎన్ కృష్ణమోహన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్ అంబ,టి వెంకటేశ్వర రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
