PS Telugu News
Epaper

ప్రత్యేక వర్షాకాల శిబిరం ఘనంగా ముగింపు

📅 29 Sep 2025 ⏱️ 2:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

(సూర్యుడు సెప్టెంబర్ 28 రాజేష్)

దౌల్తాబాద్, సెప్టెంబర్ 28: ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ జాతీయ సేవా పథకం యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో దొమ్మాట, గాజులపల్లి గ్రామాలలో వారం రోజుల పాటు కొనసాగిన ప్రత్యేక వర్షాకాల శిబిరం ఈరోజు ఘనంగా ముగిసింది. ముగింపు సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ మమతా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలోని రుగ్మతలను గుర్తించి భవిష్యత్తులో జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు. యూనిట్–2 ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్ గారు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యతతో గొప్ప పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమం చివరగా విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. గ్రామ పెద్దలు, యువత, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top