PS Telugu News
Epaper

ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ఆర్థిక భరోసా

📅 22 Mar 2026 ⏱️ 11:16 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కే.సి యన్ గుంట లో తుమ్మ వెంకటరమణయ్య ఆరోగ్యం సరిలేనందిన మరణించడం జరిగింది.ఈయన గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన (పిఎంజెజెబివై) పథకం యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పిఎంజెజెబివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంజెజెబివై ద్వారా రూ.2 లక్షల రూపాయలు ఈయన భార్య సుప్రియ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మన్నారుపోలూరు బ్రాంచ్ మేనేజర్ ఉమా మహేశ్వరి, జనరల్ మేనేజర్ పాండురంగ మిత్తంతాయ మరియు డీజీమ్ రామ మోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, ఏపియై, ఎస్.ఎస్.యై కూడా అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో మన్నారుపోలూరు కెనరా బ్యాంక్ మేనేజర్ ఉమా మహేశ్వరి, సూళ్లూరుపేట బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కరుణానిధి, అసిస్టెంట్ మేనేజర్ నాగ రాజేశ్వరయ్య, క్లర్క్ కృష్ణ మూర్తి, హేమసుందర్, మరియు తిరుపతి డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సతీష్, సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది.

Scroll to Top