PS Telugu News
Epaper

ప్రధాని మోడీ చర్యలని వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్ధం కండి

📅 16 Dec 2025 ⏱️ 6:49 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ సిపిఐ ఎంఎల్ వి ప్రభాకర్ పిలుపు

మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం.(MGNRAMGA) రద్దు చేయడానికి పేరు మార్పిడి భారత్_గ్యారెంటీ ఫర్ రోజుగా ర్ అండ్ ఆ జీవికా మిషన్ పేరుతో బిల్లు తెచ్చి వ్యవసాయ కూలీలకు శతగోపంపెడుతున్న ప్రధాని మోడీ చర్యల్ని వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్ధం కండి…వి. ప్రభాకర్ . పిలుపు…..
అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఏ ఐ యు కె ఎస్ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం. కె ఎం ఎస్ ఉమ్మడిగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ (ప్రజా పంథా) మాస్ లైన్ కార్యాలయంలో పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించింది… ఈ ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. వి. ప్రభాకర్… మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాలు రావడంతో వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్న కోట్లాదిమంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారు.. ఉపాధి నైన చూపండి సాగుభూములైన ఇవ్వండి ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి.. దీని ఫలితంగా మొదటి యూపీఏ సర్కారులో వామపక్ష పార్టీల ప్రతిపాదన మేరకు మాహ త్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించడం జరిగింది అని అన్నారు.. ఈ చట్టం వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం అమలు పని గ్యారంటీ.. పని కోరిన వారికి పని కల్పించలేక పోతే నిరుద్యోగ భృతి.. పని స్థలాల్లో ప్రమాదం లో మరణిస్తే నష్టపరిహారం చెల్లించే విధంగా చట్టంలో రక్షణ కల్పించారు అని అన్నారు….ఈ చట్టం పరిధిలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి. 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి… నిర్దిష్టంగా పేర్కొంది… యంత్ర పరికరాలతో వ్యవసాయ కూలీలు ఉపాధి కో లిపోయారని అందుకుగాను ఈ చట్టంలో యంత్ర ప్రవేశాన్ని నిషేధించింది. అని అన్నారు… కానీ 2014 అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ సర్కార్ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పోవడం ప్రారంభించారని డిజిటల్ హాజరు పట్టిక.. తో పాటు నిధుల కోత. చట్టంలో మార్పులు ఒకటి ఒకటిగా చేస్తూ వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగానూ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలను రూపొందించడంతో ఘరానా మోసగాడిగా మోడీ వ్యవసాయ కూలీలకు తీరిన అన్యాయం చేశాడని ఆగ్రహించారు….
తేనె పూసిన కత్తి లాగా పని దినాలను 100 నుంచి 125 పెంచుతున్నామని అట్లాగే పేరు మాత్రమే మారుస్తున్నామని మోసపూరితంగా పార్లమెంట్లో ఆమోదానికి పెట్టారని అని అన్నారు.. చట్టం ని మార్చి స్కీముగా రూపొందిస్తే పని గ్యారంటీ పోతుంది… 125 రోజులు కాదు కదా 200 రోజులు పెట్టిన అమలు జరిగే పరిస్థితి కాదు… చట్టానికి మాత్రమే అమలు చేసుకో ని శక్తి సామర్థ్యం ఉంటుందని స్కీములకు ఉండదని అన్నారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 12 కోట్ల 50 లక్షల పని దినాలు కల్పిస్తే ఈ సంవత్సరం ఏడు కోట్ల 50 లక్షల పది దినాలు మాత్రమే ఉపాధి కూలీలకు కల్పించారు.. ఈ చట్టాన్ని నీరుగార్చి పనిలో ప్రభుత్వం ఉందని అనడానికి నిదర్శనమని అన్నారు. జవాబుదారీతనం ఉండదని అన్నారు.. అందుకే ఈ మార్పుని వ్యతిరేకిస్తున్నామన్నారు. చట్టం స్థానంలో ఈ స్కీమ్ ని అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం 90% ఆర్థిక భారాన్ని ముగిసేది కేవలం 60 శాతం మాత్రమే 10% రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోసేది.. కానీ నేడు కేంద్రం 60 శాతం.. రాష్ట్రాలు 40 శాతం ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందని గుర్తు చేశారు.2005 ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు….అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్షులు. G. కిషన్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్నా 2005 ఉపాధి మీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధి కూలీలపై ఉందని ఐక్య ఉద్యమాలు చేసి కాపాడుకుందామని అన్నారు..మోడీ కార్పొరేట్ శక్తులకు సేవ చేయడమే తప్ప వ్యవసాయ కూలీలకు చేసింది శూన్యమనిఆవేదన వ్యక్తం చేశారు…AIUKS రాష్ట్ర కార్యదర్శి. B. దేవారం మాట్లాడుతూ బీజేపీ అంటేనే రైతులు,, కార్మిక,, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమని ఉపాధి హామీ చట్టాన్ని మార్చడంతోనే బైర్గతమైందని అన్నారు.. అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను, రైతాంగం సాధించుకున్న సబ్సిడీలను ఒక కలంపొడుతూనే రద్దు చేస్తున్నారని మోడీ స్వభావం కార్పొరేటు. సామ్రాజ్యవాదం అనుకూల స్వభావంగా భైర్ఘతమవుతుందని వీటికి వ్యతిరేకంగా ఐక్య ఆందోళనకు పిలుపునిచ్చారు…ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో… అఖిలభారత ప్రగతిశీల ఐక్య రైతు సంఘం నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ నాయకులు..B. అశోక్ తదితరులు పాల్గొన్నారు….ఉద్యమ అభినందనలతో….

Scroll to Top