ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నాయుడుపేట కు ఉత్తమ పి.యు అవార్డు
పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు లో ఉత్తమ సేవలు అందించినందుకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో నవజీవన్-సి.సి- పి.యు ప్రాజెక్టు కు జిల్లాలో ఉత్తమ పి.యు అవార్డు ఇచ్చారు. ఈ అవార్డును డి.యమ్& హెచ్.వో – డా. బి. బాలక్రిష్ణ నాయక్ మరియు డి.యల్.ఎ.టి.వో – డా. పి. శైలజా చేతులు మీదుగా నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ – కె. సహదేవయ్య, సి.సి- పి.యు ప్రాజెక్టు డైరెక్టర్ – కె. విక్టోరియా, ప్రాజెక్టు మేనేజర్ – కె. బాలాజి మరియు సిబ్బంది కవిత, మంజుల, శ్రావణి, సాయి లక్ష్మి, ఐశ్వర్య, ముని కూమారి మరియు శ్రీ లత కలిసి అందుకొన్నారు.
