ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన
పయనించే సూర్యుడు నవంబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఐ.ఇ.సి స్టాల్” ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనను నాయుడుపేట లోని “ప్రభుత్వ హాస్పిటల్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమమును ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ అమర్నాథ్ చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన కె. బాలాజి మాట్లాడుతూ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లక‌్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ.ఆర్.టి మందులు, ఏ.పి.శాక్స్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. తదుపరి మెడికల్ ఆఫీసర్ పి.యన్ అమర్నాథ్ మాట్లాడుతూ నవజీవన్ ఆర్గనైజేషన్ వారు చేస్తున్న సేవలు అభినందనీయం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ కె. భాస్కర్ రాజు, నవజీవన్ సి.సి పి.యు ప్రాజెక్టు సిబ్బంది కె.బాలాజి,కవిత, శ్రావణి, సాయి లక్ష్మి, శ్రీలత, ఇతర హాస్పిటల్ సిబ్బంది మరియు ఇతర ప్రజలు పాల్గొన్నారు. తదుపరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మరియు యస్.పి.జి.సి జూనియర్ కళాశాల నందు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగించి వారికి క్విజ్ మరియు వ్రాతపరీక్షలు నిర్వహించి వారు ఎంతవరకు అవగాహన పొందారో తెలుసుకోవడం జరిగింది. వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు త్వరలో అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్ లు, ఇతర అధ్యాపకులు, 83 విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
