ప్రభుత్వం ఆశవర్కర్ల డిమాండ్ లు నెరవేర్చాలి..ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్…
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్ల నెరవేర్చాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి రావాలని ఆశ వర్కర్లు శనివారం బైంసా పట్టణంలోని అయన నివాసంలో వినతిపత్రం అందించిన సందర్భంగా మాట్లాడారు. చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశం లో బిజేఎల్ఫీ నేత మహేశ్వర్ రెడ్డి, లేదా తాను ఆశ వర్కర్ల తరఫున మాట్లాడనున్నట్లు చెప్పారు.. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన వారిలో సంఘ నాయకులతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి పెద్ద మొత్తంలో ఆశ వర్కర్లు ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చారు.