ప్రభుత్వ ఉపాధ్యాయుడి గొప్ప నిర్ణయం: విద్యకు ఆదర్శం!
పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
టిడిపినాయకులు మాలెపాటి శివరామ్ నాయుడు మాట్లాడుతూ, “జిల్లేడు మంద హైస్కూల్లో ప్రభుత్వ గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న శ్రీ నాగేశ్వరరావు ఈరోజు మనందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచారు. తమ కూతురు జ్యోతిని సుండుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే మూడో తరగతి చదివించాలనే ఆయన నిర్ణయం చాలా గొప్పది. ఆయన ఆర్థికంగా స్థితిమంతులే అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని బలంగా నమ్మి, సొంత బిడ్డను అదే వ్యవస్థలో చదివించడం ఆయన గొప్ప నిబద్ధతకు నిదర్శనం. ఒక ప్రభుత్వ టీచర్ అయ్యి ఉండి, తమ బిడ్డను ప్రభుత్వ బడిలోనే చేర్చడం చాలా గొప్ప విషయం, ఇది ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన స్ఫూర్తి,” అని ప్రశంసించారు.”నాగేశ్వరరావు ఈ ఆదర్శనీయమైన స్ఫూర్తిని గుర్తించే ఈరోజు ఆయన దంపతులను మనందరం సన్మానిస్తున్నాము,” అని మాలెపాటి శివరామ్ నాయుడు గారు తమ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సన్మాన కార్యక్రమంలో తమతో పాటు క్లస్టర్ ఇన్‌ఛార్జి మోహన్ బాబు నాయుడు, సోంపల్లి కిరణ్, క్లస్టర్ ఇన్‌ఛార్జి2 రమణ, ఎస్సీ మరియు ఎస్టి నాయకులు చంద్రమౌళి, మరియు కురవ సంఘం జిల్లా అధ్యక్షులు మాంగిరి పాల్గొన్నార”
నాగేశ్వరరావు నిర్ణయం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. తమ వృత్తిపై, తాము బోధించే వ్యవస్థపై ఇంతటి నమ్మకాన్ని ఉంచిన ఆయన్ను సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాము.