ప్రభుత్వ రాయితీలు పొందాలంటే చెరువులకు అనుమతులు తప్పనిసరి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
పయనించే సూర్యుడు జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆక్వా చెరువులకు అనుమ తులు తప్పనిసరని అను మతులు పొందని పక్షంలో ప్రభుత్వ రాయితీలు పొంద లేరని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆక్వా రైతాంగానికి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు ఆక్వా రిజిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగక పో వడానికి గల కారణాలపై మత్స్య శాఖ అధికారుల తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షించారు. ఈ సంద ర్భంగా మత్స్య శాఖ అధి కారులు వివరణ ఇస్తూ డి పట్టా భూముల పట్టా ఇచ్చినది ఒకరికి అయితే ప్రస్తుతం అను భవిస్తున్నది వేరొకరుగా ఉండడంతో సమస్యలకు దారితీస్తోం దన్నారు. దేవస్థాన భూము లు దేవస్థానం వారి అను మతి లేకుండా చెరువులకు అనుమతి ఇవ్వడం కుదర దన్నారు సొసైటీ భూములు పట్టా భూములు మాదిరి గానే సొసైటీ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయు టకు నిర్దిష్టమైన సొసైటీ నుండి లీజ్ డాక్యుమెంట్లు ఉండాలన్నారు కొన్ని భూముల వివరాలు ఆన్లైన్లో లేకపో వడం వలన నమో దు కావడం లేదన్నారు పల్లిపాలెం అంతర్వేది దేవస్థానం అంతర్వేది కర్ర గొంది కేశవదాసు పాలెం లలో చాలా భూములు చెరువులుగా కనిపించి నప్పటికీ పల్లపు భూములు కావడం వల్ల నిత్యం నీటితో ఉండి ఆక్వాసాగు జరగడం లేదన్నారు జాతీయ హరిత ట్రిబ్యునల్ కేసులో ఉన్న భూములు, సిఆర్జెడ్ పరిధి లో ఉన్న భూములు, లంక భూముల రిజిస్ట్రేషన్ చే యలేమన్నారు. భూముల వివరాలు సర్వే నెంబర్లు ఆన్లైన్లో ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పలు పరిపాలనా, సాంకేతిక మరి యు సామాజిక సమస్యలు ఎదురవుతున్నాయనీ వా టిని అధిగమించి నిర్ణీత కాలవ్యవధిలో అనుమ తులు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించా రు.భూస్వామ్య పత్రాలు పట్టాదారు పాస్ బుక్, రిజిస్ట్రేషన్ డీడ్ స్పష్టంగా లేకపోవడం,లీజు భూ ముల విషయంలో సరైన ఒప్పంద పత్రాలు లేకపో వడం,పాత రికార్డులు,కొత్త డిజిటల్ రికార్డుల మధ్య వ్యత్యాసాలు ఉండడం ఒక కారణమన్నారు.ఆన్లైన్ దరఖాస్తు సమస్యలు, పోర్టల్ సాంకేతిక లోపాలు సర్వర్ డౌన్, అప్లోడ్ ఫెయి ల్యూర్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాల కొరత,రైతులకు డిజిటల్ అవగాహన తక్కువగా ఉండటంతో జాప్యాలు చోటు చేసుకుంటున్నా యన్నారు ప్రధాన శాఖలైన మత్స్య, రెవెన్యూ, కాలు ష్య నియంత్రణ మండలి అనుమతులు తప్పనిసర న్నారు ,శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమన్నారు.పర్యావరణ అనుమతులపై స్పష్ట త లేకపోవడం తీపి నీరు, ఉప్పు నీరు చెరువుల వర్గీకరణలోఅయోమయం,పారదర్శకత లోపాలతో జాప్యాలు జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ ఆక్వా చెరు వుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడం ద్వారా రైతులకు లాభం చేకూరడమే కాకుండా, ఆక్వా రంగం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుంద న్నారు. చెరువుల అనుమతుల జారీలో ఇబ్బందులను అధిగ మిస్తూ నిర్దేశిత కాలవ్యవ ధిలో అనుమతులు పూర్తి చేయాలని ఆదేశించారు ఆ క్వాకల్చర్ రంగం గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలక పా త్ర పోషిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సం యుక్త కలెక్టర్ నిశాంతి, మత్స్యశాఖ అధికారి వర్ధన్ తాసిల్దారులు రవి కిరణ్ సునీల్ కుమార్, భాస్కర్ మత్స్య అభివృద్ధి అధి కారులు హేమంత్ శరత్, అశ్విని తదిత