PS Telugu News
Epaper

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధమైన నవీన్ యాదవ్

📅 26 Nov 2025 ⏱️ 3:23 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్‌లోనే నవీన్ యాదవ్‌కు అధికారికంగా పదవి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర  ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.

Scroll to Top