PS Telugu News
Epaper

ప్రాణాపాయంలో ఉన్న పాముకు రక్షణ కల్పించిన వ్యక్తి

📅 02 Jan 2026 ⏱️ 10:38 AM 📝 వైరల్ న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా మనుషులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలకు సంబంధించిన వార్తలను తరచుగా వింటూనే ఉంటాం. కానీ, ఒక పాము ఆత్మహత్య చేసుకోవడం లేదా అలా చేయడానికి ప్రయత్నించడం చూశారా? లేదా విన్నారా? అంటే చాలా మంది నుంచి లేదు అనే సమాధానమే వస్తుంది. తాజాగా, పాము ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ పామును మృత్యువు నుంచి ఓ మనిషి కాపాడారు.ఆ వీడియోలో పాము తనను తాను ఎలా మింగడం ఎలా ప్రారంభిస్తుందో చూడవచ్చు. అది తన శరీర సగ భాగాన్ని స్వయంగా మింగేసింది. కానీ, పక్కనే ఉన్న ఓ వ్యక్తి వచ్చి దాన్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆపాడు. ఆ వ్యక్తి ప్రయత్నంతో ఆ పాము తన తోక భాగాన్ని బయటకు వదిలేసింది. స్పెక్ల్డ్ కింగ్ స్నేక్ అని ఈ పామును అంటున్నారు. ఈ పాము మానవులకు మానవులకు ప్రమాదం కాదు. అంటే విషపూరితం కాని పాము. ఎలుకలు, బల్లులతోపాటు కొన్నిసార్లు ఇతర పాములను ఇది తింటుంది.ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. జంతులను రక్షించండి.. ప్రపంచాన్ని కాపాడండి అని కొందరు పేర్కొన్నారు. ఈ సంఘటనను ఔరోబోరస్‌తో పోల్చారు కొందరు. ఇది ఒక పురాతన చిహ్నం అని.. దీనిలో పాము తన తోకను తానే తింటున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియోలో కూడా అలాంటి దృశ్యమే ఉందని పేర్కొన్నారు.

Scroll to Top