ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశం
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సార్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఆశా డే ప్రోగ్రామ్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాడికి నందు యాడికి మెడికల్ ఆఫీసర్ సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆశాడే ప్రోగ్రామ్ నందు వచ్చిన సూపర్వైజర్లకు ఏఎన్ఎం లకు ఆశా కార్యకర్తలకు ఇంగ్లీష్ కొత్త సంవత్సరమున శుభాకాంక్షలు తెలిపి ఈ సంవత్సరం నుండి గ్రామంలో తీసిన రక్తపుతలను ఒకటి నుండి మొదలు పెట్టాలని తెలియజేయడం జరిగింది అలాగే గ్రామంలోని ప్రజలకు వెక్టార్ కంట్రోల్ ఐజిన్ గురించి వివరించవలెనని తెలియజేయడం జరిగినది గ్రామమునందు ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించవలెనని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు సి హెచ్ ఓ జుబేదా పీహెచ్ఎన్ శోభకుమారి మేల్ సూపర్వైజర్ రాంప్రసాద్ గౌడ్ ఏఎన్ఎంలు ఎం ఎల్ హెచ్ పి లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
