PS Telugu News
Epaper

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పదవీ విరమణ కార్యక్రమం…

📅 28 Feb 2026 ⏱️ 4:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, ఫిబ్రవరి 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)

రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాప్ మెంబెర్ గా విధులు నిర్వహిస్తున్న ఈగ సుదర్శన్ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఆధ్వర్యంలో పదవి విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, సహకార సంఘ మెంబర్లు, సిబ్బంది ఈగ సుదర్శన్ కు శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సహకార సంఘ మెంబర్లు మాట్లాడుతూ.. 1990 నుండి నేటి వరకు 36 సంవత్సరాలుగా ఇంచార్జ్ సెక్రెటరీగా, సెక్రటరీ గా, ఇప్పుడు స్టాఫ్ మెంబర్ గా చాలా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఈగ సుదర్శన్ అని పేర్కొన్నారు. గతంలో ఆయనపై నిందలు వేసి కొన్ని అన్నివార్య కారణాలవల్ల సహకార సంఘం నుండి సస్పెండ్ చేశారని, మళ్లీ 2020లో సంజీవరెడ్డి పిరెడ్ లో అపాయింట్ మెంట్ చేసుకున్నారని తెలిపారు. సహకార సంఘంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన పదవీ విరమణ పొందడం చాలా బాధాకరమని అన్నారు. అదేవిధంగా సహకార సంఘంలో మళ్లీ టెంపర్ వారీగా ఆయనను విధుల్లోకి తీసుకోవాలని సహకార సంఘ మెంబర్లు, రైతులు కోరారు. అనంతరం ఈగ సుదర్శన్ మాట్లాడుతూ.. సహకార సంఘంలో 36 సంవత్సరాలుగా పనిచేసిన ఎలాంటి గుర్తింపు లేదని, బెనిఫిట్స్ కూడా రాలేవని, కావున గ్రామ సర్పంచ్, సహకార సంఘ మెంబర్లు, గ్రామ పెద్దలు సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుర్ల గోపి, ఏముల గజేందర్, తోట శంకర్ పటేల్, అడప శంకర్, బొట్టే గజేందర్, సురేష్, సాగర సంఘ సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top