PS Telugu News
Epaper

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కరుణాకర్

📅 02 Mar 2026 ⏱️ 6:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

( పయనించే సూర్యుడు మార్చి 2 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల నూతన రాష్ట్ర కార్యవర్గంలో షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, తెలంగాణ ఉద్యమకారుడు కరుణాకర్ ను ఇకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల నూతన రాష్ట్రస్థాయి కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కరుణాకర్ ఎంపిక కావడం విశేషం. తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో ప్రస్థానం ఉన్న కరుణాకర్ ఉద్యమ జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలల రంగంలో విద్యావేత్తగా అపార అనుభవం ఉంది. కువైపు విద్యాపరంగా మరోవైపు రాజకీయ రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్న కరుణాకర్ రాష్ట్రస్థాయిలో కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో పలువురు హర్షం ప్రకటిస్తున్నారు..

Scroll to Top