ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్
మండల విద్యాధికారి కి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు.
ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు మార్చి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చకుండా,నిబంధనను అతిక్రమించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఫరూఖ్‌నగర్ మండల సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం మండల విద్యాధికారి గారికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆకాష్ నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, పాఠశాల ప్రాంగణాల్లోనే బుక్స్, యూనిఫార్మ్ విక్రయిస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా వేధిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వీటి అమ్మకాలను నిషేధించినా, ఫరూఖ్‌నగర్ మండలంలో తనిఖీలు లేకపోవడం వల్లే యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు.ఏఐఎస్ఎఫ్ ప్రధాన డిమాండ్లు:పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫార్మ్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలి.అనుమతి లేకుండా అడ్డగోలుగా పెంచిన ఫీజులను నియంత్రించాలి.నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి.విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలి.ఫీజుల నియంత్రణపై అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అరుణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.