ప్రైవేట్ బస్సులు వాటిని నడిపే డ్రైవర్ల పై ఆర్టీవో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించాలి
పయనించే సూర్యుడు డిసెంబర్ 3( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మండలం పరిధిలోని దవది గుంట సమీపంలో ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది ఈ బస్సు గొల్లల మలుగు గ్రామం దగ్గర ఉన్న సి బి ఎస్ టైనిటాట్స్ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంతో నడుపు తుండగా ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి పంట పొలాల్లో బోల్తా కొట్టింది ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు నలుగురు టీచర్లు ఉన్నారు ఈ ప్రమాదంలో ఎవరికి ఏం జరగలేదు ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, RTO ప్రైవేట్ స్కూలు బస్సులపై వాటి యొక్క కండిషన్ పై ,డ్రైవర్ల యొక్క నైపుణ్యత అర్హతపై తనిఖీలు చేపట్టాలని కోరుతున్నాం అప్పుడప్పుడు వానొచ్చి వెళ్లేటట్టు తనిఖీలు చేయడం కాదు ఎన్ని ప్రైవేట్ వెహికల్ తిరుగుతున్నాయో ఒక వెహికల్ ఏ కండిషన్ లో ఉందో చూడకుండా ఏజెంట్ పంపించిన వాటిని నామమాత్రపు తనిఖీ చేసి పంపించటం కాదు ఆర్టీవో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అలా కాకుండా.దగ్గరుండి తనిఖీలు చేయాలి అలాకాకుండా రోడ్డుమీద డ్రైవర్ నిలబడుకొని తనిఖీలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఉన్నతాధికారులు ఒకసారి ఆలోచించాలి సూళ్లూరుపేట ఆర్టీవో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఇక్కడ జరుగుతున్న తంతు ఇదే ఒక ఒక విలేకరి వెళ్లి వివరణ నకోరగా మీరు ఏం చేసుకున్న పర్వాలేదు నా పని ఇంతే అని సమాధానం ఇచ్చారు ఇకనైనా అధికారులు ఇలాంటి దందాను అరికట్టండి