ఫతేనగర్‌లో గణేష్ మండపాలను సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఫతేనగర్‌లో పర్యటించి పలు గణేష్ మండపాలను సందర్శించారు. ఎఫ్ బీ జి వై ఏ అసోసియేషన్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటనలో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్, వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఎంపీ ఈటల రాజేందర్‌ను పలు గణేష్ మండపాలకు తీసుకెళ్లారు. మండపాల వద్ద జరుగుతున్న ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులతో మాట్లాడారు.ఫతేనగర్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలను అభినందించిన ఈటల రాజేందర్, మండపాల నిర్వాహకులకు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ఎఫ్ బీ జి వై ఏ అసోసియేషన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.