ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
పయనించే సూర్యుడు జనవరి 25 ( సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)
సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతంగా నడిపించినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూళ్లూరు పేట ఎమ్మెల్యే డాక్టర్ విజయ శ్రీని అభినందించారు చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని, సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఇటీవల సూళ్లూరుపేటలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ విజయవంతం కావడం గురించి ఎమ్మెల్యే విజయశ్రీ ముఖ్యమంత్రికి వివరించారు. పండుగ నిర్వహణ తీరు, ప్రజల నుండి వచ్చిన స్పందన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి , ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకుంటూ “కీప్ ఇట్ అప్” అని ప్రత్యేకంగా అభినందించారు.
.
