ఫ్లెమింగో ఫెస్టివల్ స్థాపించిన పెద్దలను మరిచార లేక ?
పయనించే సూర్యుడు జనవరి 15 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ ఆవలు దాస్ . ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ పైన ఆయన ప్రసంగిస్తూ మనం ప్రతి ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ పండగని జరుపుకుంటున్నాం.మొట్టమొదటిసారిగా సూళ్లూరుపేట కు ఆ పండగని పరిచయం చేసి జరిపించాలన్నకున్నవారు ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే,మాజీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ పరసారత్నం గారు. ఈ పండగను జరిపించాలని అనుకున్నదే తడువుగా ఒకప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్లి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి వివరించి. ఈ పండుగను జరిపించాలని ఆయనకి వివరించి ఆయన దగ్గర్నుంచి ఫండ్స్ పర్మిషన్ తీసుకొచ్చి అంగరంగ వైభవంగా మూడు రోజులు జరిపించారు. అలా ఈ పండుగ పునాది పడింది. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ పండుగ జరుపుకుంటున్నాం. మధ్యలో కొన్ని కారణాలవల్ల ఆ పండుగను జరుపు కోలేకపోయాం. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాకా ఆ పండుగను జరిపించింది. కానీ మొట్ట మొదటిగ ఈ ఫ్లెకమింగో ఫెస్టివల్ కు పునాది వేసిన నాయకులను మరిచారు. ఇది ఎక్కడ న్యాయం ఒకసారి ఆలోచించండి.చేసిన సేవలు,చేసిన అభివృద్ధిని ఎవ్వరు చేసిన తప్పకుండ ప్రజలకు చెప్పాలి. ప్రజల యొద్దకు తీసుకొని పోవాలి. నీకు నాకు ఏమిచేసాడు అనే ప్రశ్న కంటే బడుగు బలహీన వర్గాల పిల్లలకు, ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తును కల్పించే ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు గురకుల పాఠశాలలు నియోజకవర్గానికి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో తీసుకుని వచ్చారు. శ్రీ సిటీ అభివృద్ధికి ఆయన ప్రయత్నం కూడా ఉంది. పక్షుల పండక్కి వస్తున్న వారికి వసతులు కల్పించే విషయంలో పున్నమి రెస్టారెంట్లు వంటివి తీసుకురావడం ఒక్క పరసా రత్నం ఒకరికే సాధ్యమైంది. ఇది ప్రజలు గమనించాలి. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నులవిందుగా ఈ రోజుకి ఫ్లెంగో ఫెస్టివల్ వార్షిక పండుగలు జరుగుతున్నాయి అంటే కారణం డాక్టర్ పరసారత్నం గారు. ఇది జగమెరిగిన సత్యం.. రెండు సార్లు MLA గ. విద్యశాకమంత్రిగ పని చేసి. ఇప్పటికి మార్కుపాడ్ అధ్యక్షులు గా ఉన్న పరసా రత్నం గారిని ఆహ్వానించక పోవడం బాధాకరం. తెలుగుదేశం పార్టీ పై చంద్రబాబు పై అయనకున్న గౌరవంతో తనకు తానుగా వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఒక్క పార్టీనే నమ్ముకున్న నాయకుడు డాక్టర్ పరసారత్నం గారు. ఇలాంటి నాయకులు గౌరవించక పోవడం చాలా బాధాకరమని మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ ఆవల దాస్ అన్నారు.