బడ్జెట్ లో పెండింగ్ బిల్లులు,పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం దారుణం…
తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నరసింహ రవీందర్
పయనించే సూర్యుడు మార్చు 21
2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు కేటాయించింది 26,674 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 8.2%. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంచిదే అయినా గత సంవత్సరం కంటే రూ 3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు విటన్నిటి కోసం సరిపోకపోవచ్చు . అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల గురించి, మధ్యాహ్నభోజనం నాణ్యత పెంపుగురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్తావన పట్టించుకోలేదు గత సంవత్సరం 7.58 శాతం కేటాయించగా, ఈ సంవత్సరం 8.22 శాతం కేటాయించారు. విద్యకు 15% కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ వరుసగా 3వ బడ్జెట్లో కూడా నెరవేరలేదు.అసలు PRC, DA పెండింగ్ బిల్స్ పై శ్రద్ద లేకపోవడం దారుణం.ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ సూచన చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సమీక్షించి కనీసం 18% కేటాయించాలని టిపియుయస్ డిమాండ్ చేస్తుంది.ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ 1056 కోట్లు కేటాయింపును స్వాగతిస్తున్నా అవి దారి మళ్లకుండ చూడాలి .ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రూ రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలి. ఆ నిధులకు మరికొన్ని జోడించాలి తెలంగాణ పీఆర్సీ అమలు గురించి గానీ, అదనపు నిధుల కేటాయింపు గురించి గానీ పెండింగ్ బిల్స్, DA లు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు ఇప్పటికే పిఆర్సీ అమలు 33 నెలలు ఆలస్యమైంది.ఆరు నెలల్లో మంచి పిఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.