PS Telugu News
Epaper

బత్తలవల్లం చెక్ పోస్ట్ నుండి మత్తేరిమిట్ట వెళ్ళు మార్గాన్ని నిలిపిపేసిన అధికారులు.

📅 29 Oct 2025 ⏱️ 2:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.29/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీసిటీ పరిధిలోని బత్తలవల్లం టూ మాత్తేరిమిట్ట రోడ్డు తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరగడంతో రహదారిపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న అధికారులు శ్రీ సిటీ డిఎస్పి బి.శ్రీనివాసులు, సిఐ యం. శ్రీనివాసులు,ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి,మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంఆర్ఒ సుధీర్ రెడ్డి, ఎంపిడిఒ విజయలక్ష్మి,డ్యూప్యూటీ ఎంపిడిఓ శివకుమార్, సెక్రటరీ యుసాప్ ఖన్, విఆర్ఒ మాధవి సంఘటన స్థలానికి చేరుకుని ప్రవాహ ఉధృతిని పరిశీలించి బరికెట్లను ఏర్పాటు చేసారు.మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్గంలో రాకపోకలను నిలిపివేశారు,తుపాను తీరం దాటే సమయంలో గాలులు, ఎక్కువగా ఉండవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరదయ్యపాలెం మండల తహశీల్దార్ సుధీర్ రెడ్డి తెలిపారు.

Scroll to Top