PS Telugu News
Epaper

బల్లెం బిక్షం కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన బిఆర్ఎస్ నాయకులు

📅 07 Feb 2026 ⏱️ 8:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 07 (పొనకంటిఉపేందర్ రావు) టేకులపల్లి

సులానగర్ గ్రామపంచాయతీకి బల్లెం బిక్షం ప్రైవేట్ ఉపాధ్యాయుడు, మరియు సులానగర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా బాధిత కుటుంబానికి అండగా మేమున్నామంటూ టేకులపల్లి మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, బల్లెం బిక్షం కుటుంబానికి ఆర్థిక సహాయంగా 28,000 అందించారు.సులానగర్ గ్రామ సర్పంచ్ గుగులోతు లక్ష్మనాయక్ రూ,10,000, టేకులపల్లి మండల బిఆర్ఎస్ సర్పంచ్ లు 10,000, మరియు సులానగర్ గ్రామానికి చెందిన కేలోతు రాంకుమార్, సరిలాల్ కలసి రూ,8,000, ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు భానోత్ హరిప్రియ నాయక్ రెండు క్వింటాల బియ్యాన్ని బాధ్యత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ. పార్టీ కొరకు కష్టపడిన ప్రతి కార్యకర్త వెనుకలబిఆర్ఎస్ పార్టీ హస్తము ఉంటుందని వారు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఓదార్చి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు నాయక్, సులానగర్ సర్పంచ్ గూగులోత్ లక్ష్మా నాయక్, బద్దు తండా సర్పంచ్ బానోతు నరేష్, చుక్కలబోడు సర్పంచ్ బానోతు రామ నాయక్, మాజీ ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య, మాజీ ఎంపీటీసీ బాలకృష్ణ, కుమ్మరి కిరణ్, మూడు కిరణ్, కొట్టే సురేష్, మాలప్రోలు జయరాజ్, కుమ్మరి చౌదరి,మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top