
//పయనించే సూర్యుడు// జులై 25//మక్తల్
గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో మక్తల్ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ అధ్యక్షుడు కె వి నరసింహ ఆధ్వర్యంలో లక్ష్మన్ కు మక్తల్ టౌన్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ సందర్బంగా కె వి నరసింహ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్ట పడి పని చేసి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని అన్నారు బహుజన సమాజ్ పార్టీ నిరంతరం బడుగు బలహీన వర్గాలు కోసం పని చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేంద్ర జిల్లా కార్యదర్శి బండారి చంద్ర శేఖర్ అసెంబ్లీ ఇంచార్జి పాలెం వెంకటయ్య అసెంబ్లీ ఉపాధ్యాక్షులు పరుశురాం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
