బాక్సాఫీస్ వద్ద అఖండ 2 ప్రభంజనం… బాలయ్యకు కొత్త రికార్డ్
పయనించే సూర్యుడు న్యూస్ :అఖండ తాండవం ఇప్పుడు అలోవర్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. బాలయ్య హై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్..బోయపాటి డైరెక్షన్ వెరసి.. అఖండ సినిమాలోని ప్రతీ సీన్‌కు ఆడియన్ ఎంజాయ్ చేయడం కనిపిస్తోంది. అందులోను యాక్షన్ సీన్స్‌లో అయితే.. సగటు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావడం కామన్ అనే టాక్ వస్తోంది. చిన్న చిన్న మైనస్‌లు, లాజిక్స్ పక్కకు పెడితే సినిమా బిగ్ హిట్ అనేలా యునానిమస్ టాక్ వస్తోంది. దీంతో అఖండ2 మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఇదో రికార్డ్ గా మేకర్స్ నుంచి టాక్ వస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ కు మరో లడ్డూ లాంటి అప్డేట్‌నిచ్చారు బోయపాటి. అఖండ2 కు సీక్వెల్ గా అఖండ3 కూడా ఉండనుందంటూ హింట్ ఇచ్చాడు. అఖండ2 సినిమా చివర్లో జై అఖండ పేరుతో నెక్ట్స్ సీక్వెల్‌కు లీడ్ ఇచ్చాడు. దీంతో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. జై అఖండ అంటూ అప్పుడే సంబరాలు షురూ మొదలు పెట్టేశారు.