బాచన్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కి నామినేషన్ వేసిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి
.పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్నిజాంబాద్
జిల్లా భీంగల్ మండల బాచ న్ పల్లి గ్రామంబిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎలేటి మల్లికార్జున్ రేడ్డి ఆదేశానుసారం భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వానికి బిజెపి పార్టీ బలపరిచిన శెట్టి వినోద లక్ష్మణ్ బుధవారం నాడు ముచ్కూర్ గ్రామపంచాయతీలో నామినేషన్ వేయడం జరిగింది,ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వినోద మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన సమస్యలను మరియు ప్రజలకు అవసరమయ్యే సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని తమ విలువైన ఓటు వేసి బారి మెజార్టీతో గెలిపించాలని బాచన్ పల్లి గ్రామస్తులకు విజ్ఞప్తి చేయడం జరిగింది,ఇట్టి నామినేషన్ కార్యక్రమంలో హాజరైన భీంగల్ మండల బిజెపి అధ్యక్షులు ఆరే రవీందర్ మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు బిజెపి బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారనీ మండలంలో అన్ని గ్రామలా ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ప్రతి పల్లెకు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇందూర్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో తూచా తప్పకుండా అందేలా చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్, బీజేవైఎం అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్,భాను,సంజీవ్,సుదర్శన్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు,
