PS Telugu News
Epaper

బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్ బోధిరే నాగమణి స్వామి వైస్ చైర్ పర్సన్ లతా నర్సయ్య

📅 25 Feb 2026 ⏱️ 7:17 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో

భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బొదిరే నాగమణి (స్వామి), వైస్ చైర్మన్ గా సంటి లత ( నర్సయ్య )లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ చైర్మన్ చే తొలి సంతకం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునిల్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను సన్మానించారు. చైర్ పర్సన్ నాగమణి మాట్లాడుతూ భీంగల్ పట్టణ అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని, నిలిచి పోయిన 100 పడకల ఆసుపత్రి పనులన్నీ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్వేష్ రెడ్డి, సునీల్ కుమార్ లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య , కౌన్సిలర్లు పర్స కుశలత అనంతరావు, ఆరెపల్లి శ్రీజ నాగేంద్రబాబు, తోట సతీష్ సందీప్, సంగ్య నాయక్, అంజుమ్ ఆలీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top