PS Telugu News
Epaper

బాలయ్య డ్యూయల్ రోల్ ఫస్ట్ లుక్ విడుదల

📅 26 Nov 2025 ⏱️ 12:25 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ 2 మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే బాల‌య్య మ‌రో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ‘#NBK111’గా ఇది ప్రచారంలో ఉంది. నేడు (న‌వంబ‌ర్ 26న‌) పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ ప్రాజెక్టు ప్రారంభ‌మైన‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ పవ‌ర్ పుల్ పోస్ట‌ర్‌ను పంచుకుంది.అందులో బాల‌య్య రెండు లుక్స్‌లో క‌నిపిస్తున్నారు. ఒక‌టి యోధుడిగా క‌నిపిస్తుండ‌గా మ‌రొక లుక్‌లో మెడ‌లో రుద్రాక్ష‌మాల‌తో ప‌వ‌ర్‌పుల్‌గా ఉన్నారు. అంటే ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక కాగా త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాల‌య్య, దర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన వీర సింహారెడ్డి చిత్రం ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Scroll to Top